: ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా 'జురాసిక్ వరల్డ్'
సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో పలు చిత్రాలు దూసుకుపోతున్నాయి. కొన్ని చిత్రాలైతే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో వసూళ్లు రాబడుతున్నాయి. తాజాగా హాలీవుడ్ చిత్రం 'జురాసిక్ వరల్డ్' అరుదైన రికార్డు దక్కించుకుంది. ఇటీవలే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఇప్పటికీ రూ.9వేల కోట్లకు పైగా వసూలు చేసిందట. దాంతో భారీ వసూళ్లు రాబట్టి ప్రపంచంలోనే అతి పెద్ద మూడో చిత్రంగా నిలిచిందట. మొదటి రెండు స్థానాల్లో దర్శకుడు జేమ్స్ కేమరాన్ రూపొందించిన 'అవతార్', 'టైటానిక్' చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాకు అమెరికా, చైనా నుంచే ఎక్కువ వసూళ్లు వచ్చాయట. ఇక ఈ సినిమాను నిర్మించిన యూనివర్సల్ స్టూడియో ఒకే సంవత్సరంలో రెండు భారీ చిత్రాలు తెరకెక్కించిన సంస్థగా కూడా రికార్డు సొంతం చేసుకుందట. ఈ ఏడాదిలో ఐదు చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తే వాటిలో రెండు చిత్రాలైన 'ఫ్యూరియస్-7', 'జురాసిక్ వరల్డ్' చిత్రాలు యూనివర్సల్ స్టూడియో నుంచి వచ్చినవేనట.