: ఉరిశిక్షపై స్టే కోరుతూ సుప్రీంకు వెళ్లిన మెమన్


త్వరలో ఉరిశిక్షకు గురవుతున్న యాకుబ్ మెమన్ ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ నెల 30న తనకు అమలు చేయబోతున్న ఉరిశిక్షపై స్టే ఇవ్వాలని కోరాడు. ఈ మేరకు మెమన్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశాడు. అంతేగాక తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావుకు కూడా అభ్యర్థన పిటిషన్ పెట్టుకున్నాడు. రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు తన పిటిషన్ కొట్టివేసిన వెంటనే మెమన్ గవర్నర్ కు పిటిషన్ పెట్టుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News