: మళ్లీ సినిమాల్లో నటించబోతున్న విజయశాంతి


కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి తాజాగా నటనవైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ సినిమా తీయాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కథలు కూడా వింటున్నారు. దానిపై ఆమె స్వయంగా చెబుతూ, తెలంగాణ ఉద్యమంలో బిజీగా ఉండడం, దానికి తోడు అనారోగ్యం కారణంగా ఆపరేషన్ చేయించుకోవడంవల్ల కొంతకాలంగా సినిమా రంగానికి దూరంగా ఉన్నానని చెప్పారు. ఇప్పుడు బాగానే ఉన్నానని, దేశభక్తికి సంబంధించిన కథతో, తనకు తగిన పాత్రతో సినిమా తీసే పనిలో ఉన్నానని వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం, తన సినిమా ఒకే సమయంలో విడుదలయ్యే అవకాశం వుందని ఆమె భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News