: వీహెచ్ పై సీరియస్ అయిన కురియన్
పార్లమెంటు సమావేశాల్లో భాగంగా లలిత్ మోదీ వ్యవహారంపై ఉభయసభలు వాడీవేడిగా కొనసాగాయి. లలిత్ గేట్ పై చర్చ జరగాలని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే చర్చకు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ఒప్పుకోలేదు. దీంతో, విపక్ష సభ్యులు ప్లకార్డులు పట్టుకుని వెల్ లోకి దూసుకుపోయి, నినాదాలు చేశారు. సభను కొనసాగించాలని, అందరూ తమతమ సీట్లలోకెళ్లి కూర్చోవాలని కురియన్ విన్నవించారు. దీంతో అందరూ వెనక్కి వెళ్లినా, టీకాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మాత్రం వెల్ లోనే ఉండి, నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో, 'మిస్టర్ హనుమంతరావ్, ప్లీజ్ గో బ్యాక్' అంటూ కురియన్ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. చివరకు వీహెచ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, చివరకు వీహెచ్ తన సీట్లోకి వెళ్లారు.