: రాబర్ట్ వాద్రాపై హక్కుల ఉల్లంఘన తీర్మానం కోసం లోక్ సభలో బీజేపీ డిమాండ్
లోక్ సభ మూడో రోజు కూడా దద్దరిల్లింది. సభాకార్యక్రమాలు ఏ మాత్రం ముందుకు సాగలేదు. వ్యాపం కుంభకోణం, లలిత్ మోదీ గేట్ నేపథ్యంలో మంత్రుల రాజీనామాకు కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో, బీజేపీ సభ్యులు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను టార్గెట్ చేశారు. వాద్రాపై హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని బీజేపీ ఎంపీలు పట్టుబట్టారు. ఎంపీలను ఉద్దేశించి వాద్రా అనుచిత వ్యాఖ్యలు చేశారని, పార్లమెంటు వ్యవస్థను కించపరిచారని, ఆయనను పార్లమెంటుకు పిలిపించి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, పార్లమెంటులో గందరగోళం చెలరేగింది. దీంతో, సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.