: జైల్లో ఈరోజు మెమన్ ను కలవనున్న కుటుంబసభ్యులు


మార్చి, 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి యాకుబ్ అబ్దుల్ రజాక్ మెమన్ ను కుటుంబ సభ్యులు ఈరోజు నాగపూర్ జైల్లో కలవనున్నారు. రెండు రోజుల కిందట అతని క్షమాభిక్ష పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఈ నెల 30న ఉరి తీయడం ఖరారైంది. ఈ నేపథ్యంలోనే ఈ ఉదయానికే నాగపూర్ చేరుకున్న కుటుంబ సభ్యులు... చివరిసారిగా మెమన్ ను చూసి మాట్లాడనున్నారు. మెమన్ అన్న ఇబ్రహీం అలియాస్ టైగర్ మెమన్ ఇదే కేసులో కీలక కుట్రదారుగా ఉన్నాడు. ప్రస్తుతం అతను పాకిస్తాన్ లో వున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News