: వారంలోగా కాల్ డేటా వివరాలివ్వండి... టెలికాం ఆపరేటర్లకు సుప్రీంకోర్టు ఆదేశం
టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాల్ డేటా వివరాలను వారంలోగా సీల్డ్ కవర్లో విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకు ఇవ్వాలని టెలికాం ఆపరేటర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే మూడు వారాల తర్వాతే డేటా ఓపెన్ చేయాలని కోర్టును ఆదేశించింది. నెల రోజుల తరువాతే విచారణ చేపట్టాలని చెప్పింది. కాల్ డేటా వివరాలు ఇవ్వాలంటున్నారంటూ టెలికాం ఆపరేటర్లు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు పైవిధంగా తీర్పు వెల్లడించింది. అయితే కాల్ డేటా వివరాలు ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని, దానిపై తెలంగాణ ప్రభుత్వం తమను ప్రాసిక్యూట్ చేస్తామని బెదిరిస్తోందని టెలికాం ఆపరేటర్లు కోర్టుకు తెలిపారు. అటు ఏపీ కూడా తమపై ఒత్తిడి తెస్తోందని, ఇలా రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నామని వివరించారు. కోర్టు ఆదేశాలు ఉన్నంతవరకూ ఎవరి బెదిరింపులను ఖాతరు చేయాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.