: విపక్షాల నిరసనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: లోక్ సభలో సోనియా ఆవేదన
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి బీజేపీ నేతల సహకారం అందించిన అంశం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తో పాటు రాజస్థాన్ సీఎం వసుంధర రాజే రాజీనామాకు విపక్షాలు పట్టుబట్టాయి. వరుసగా మూడో రోజు కూడా సభను స్తంభింపజేశాయి. దీంతో కొద్దిసేపటి క్రితం లోక్ సభను స్పీకర్ వాయిదా వేశారు. అంతకుముందు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, విపక్షాల నిరసనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.