: పార్లమెంటు ప్రాంగణంలో టీడీపీ ఎంపీల ధర్నా
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజున టీడీపీ ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు ధర్నా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్టు ప్రకటించారని, అప్పట్లో దీనికి అన్ని పార్టీలు ఓకే చెప్పాయని... అందువల్ల వెంటనే ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోకపోతే, ఆందోళనను ఉధ్ధృతం చేస్తామని హెచ్చరించారు.