: భద్రాచలంలో ఈరోజు టి.టీడీపీ నేతల పుష్కరస్నానం


పలు అంశాలపై గత కొన్ని రోజులుగా నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తూ పోరాటాలు చేస్తున్న తెలంగాణ టీడీపీ నేతలకు పుష్కరస్నానం చేసేందుకు ఈరోజు కుదిరింది. పుష్కరాలకు రెండు రోజులు మిగిలుండటంతో ఎర్రబెల్లి దయాకర్ రావు, రమణ తదితరులు భద్రాచలంలో పుష్కరస్నానం ఆచరించనున్నారు. తరువాత రాములవారిని దర్శించుకోనున్నారు. అనంతరం సత్తుపల్లి వెళ్లి పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను వారంతా పరామర్శించనున్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్టైన సండ్ర ఇటీవలే బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News