: ‘రీచ్’లో వనజాక్షి ‘గీత’ దాటారట!... తహశీల్దార్ కేసును క్లోజ్ చేసిన ఏపీ కేబినెట్


ఇసుక రీచ్ వివాదంలో కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షి, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ల మధ్య నెలకొన్న వివాదంపై నిన్న ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చింతమనేనిపై వనజాక్షి పెట్టిన కేసును ప్రభుత్వం మూసేసింది. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ వివాదంపై రెవెన్యూ అసోసియేషన్ రోజుల తరబడి ఆందోళనలు చేసింది. అయితే వనజాక్షి సోదాలకు వెళ్లిన ఇసుక రీచ్ అసలు కృష్ణా జిల్లా పరిధిలోనిదే కాదట. పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ఇసుక రీచ్ వద్దకు వెళ్లిన వనజాక్షి, చింతమనేనితో వాగ్వాదానికి దిగారని ప్రభుత్వ విచారణలో తేలిందని విశ్వసనీయ సమాచారం. ఈ కారణంగానే చింతమనేనిపై వనజాక్షి పెట్టిన కేసును ప్రభుత్వం మూసేసినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News