: ఏపీ దెబ్బకు దిగొచ్చిన ఎల్ఈడీ బల్బుల ధరలు!... చంద్రబాబు సర్కారుకు కేంద్రం ప్రశంసలు
విద్యుత్ పొదుపు పథకాల్లో ఏపీ చర్యలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. నిరంతర విద్యుత్ సరఫరా విషయంలో మెరుగైన పనితీరు కనబరచిన ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా ఎల్ఈడీ ధరలు దేశవ్యాప్తంగా భారీగా తగ్గాయి. పది నెలల క్రితం 7 వాట్ల ఎల్ఈడీ బల్బు రూ.300 పలికితే, ప్రస్తుతం 9 వాట్ల ఎల్ఈడీ బల్బు కేవలం రూ.72.40కే లభిస్తోందట. దీనికంతటికీ చంద్రబాబు సర్కారు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే కారణమని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీసియెన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఎండీ సౌరభ్ కుమార్ చెబుతున్నారు. విద్యుత్ పొదుపు, సంరక్షణ పథకం కింద చంద్రబాబు ప్రభుత్వం రెండు కోట్ల మందికి ఎల్ఈడీ బల్బును రూ.10కే అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే 50 లక్షల ఎల్ఈడీ బల్బుల పంపిణీ జరిగిపోయింది. దీంతోనే బహిరంగ మార్కెట్ లోనూ ఎల్ఈడీ బల్బుల ధరలు దిగిరాక తప్పలేదని సౌరభ్ కుమార్ చెప్పారు.