: వేం నరేంద్రరెడ్డి కుమారుడిపై ఉచ్చు బిగిస్తున్నారా?


ఓటుకు నోటు కేసులో టీటీడీపీ నేత వేం నరేంద్రరెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ పై ఉచ్చు బిగుసుకుంటున్నట్టే కనిపిస్తోంది. ఈ కేసులో కృష్ణ కీర్తన్ కీలకమైన పాత్ర పోషించారని ఏసీబీ అధికారులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇచ్చిన రూ. 50 లక్షల సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందన్న సంగతి కృష్ణ కీర్తన్ కు తెలుసని ఏసీబీ భావిస్తోంది. కృష్ణ కీర్తన్ వాడుతున్న ఫోను అతని పేరుపై లేదు. ఈ ఫోన్ నుంచి టీడీపీ నేతలకు పలు ఫోన్ కాల్స్ వెళ్లాయట. అయితే, బెంగళూరులో కృష్ణ కీర్తన్ పనిచేస్తున్న కంపెనీ నుంచి అతని కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటే... ఇదే అతని ఫోన్ అని నిర్ధారణ అయిందట. దీంతో, ఈ కేసులో కృష్ణ కీర్తన్ పాత్ర చాలా కీలకమైందని అధికారులు ఓ అంచనాకు వచ్చారని సమాచారం. దీంతో, అతనిపై ఉచ్చు బిగించే పనిలో ఏసీబీ పడిందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News