: లండన్ లో తెలంగాణ బోనమెత్తిన స్వామి గౌడ్
తెలంగాణ సంప్రదాయం బోనాల పండుగ లండన్ లో ఘనంగా జరిగింది. తెలంగాణ నుంచి లండన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డ తెలుగు ప్రజలు నిన్న బోనాల పండుగను సంప్రదాయరీతిలో జరుపుకున్నారు. ఈ వేడుకలకు అక్కడి తెలుగువారి ఆహ్వానం మేరకు తెలంగాణ శాసనమండలి స్పీకర్ స్వామి గౌడ్ లండన్ వెళ్లారు. అక్కడి తెలుగు ప్రజలతో కలిసి ఆయన బోనమెత్తి తన మొక్కు తీర్చుకున్నారు.