: హరీష్ రావ్... నీవేమైనా తెలంగాణ తురుంఖాన్ అనుకుంటున్నావా?: డీకే అరుణ
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావుపై టీకాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే డీకే అరుణ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇటీవల ఓ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ, రాయలసీమ ప్రాజెక్టులకు అరుణ హారతి పట్టారని వ్యాఖ్యానించడం ఆమె ఆగ్రహానికి కారణమైంది. దీనిపై స్పందిస్తూ, అప్పట్లో మంత్రిగా హరీషే ఉన్నారని... అప్పుడు ఆయన సంబంధిత జీవోను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. "హరీష్ రావ్, నీవేమైనా తెలంగాణ తురుంఖానా? తెలంగాణ ఏమైనా నీ జాగీరా? నిజమైన తెలంగాణ వాదులం మేమే... తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే" అంటూ ఆమె ఫైర్ అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.