: ఎంపీలకు పార్లమెంటు క్యాంటీన్ రాయితీని తొలగించాల్సిందే...78 వేల మంది నెటిజన్ల అభిప్రాయం
పార్లమెంటు క్యాంటీన్ లో ఎంపీలకు లభిస్తున్న రాయితీని తొలగించాల్సిందేనంటున్నారు నెటిజన్లు. రెండు వారాలుగా ఆన్ లైన్ లో కొనసాగుతున్న సర్వేకు 78 వేల మంది నెటిజన్లు స్పందించారు. ‘‘గ్యాస్ సబ్సిడీని వదులుకోండని ఎంపీలు సామాన్యులకు చెబుతుంటే, పార్లమెంటు క్యాంటీన్ లో వారికి అందుతున్న రాయితీని వదులుకోమని మనం ఎంపీలను ఎందుకు కోరకూడదు?’’ అంటూ పార్లమెంటు ఆహార నిర్వహణ కమిటీ చైర్మన్ జితేందర్ రెడ్డి ఓ వెబ్ సైట్ లో సంధించిన ప్రశ్నను ఇప్పటిదాకా 78 వేల మంది నెటిజన్లు సమర్థించారు. పార్లమెంటు సభ్యులకు రాయితీతో కూడిన ఆహారం అవసరం లేదని నెటిజన్లు తేల్చిచెప్పేశారు.