: సుష్మ, రాజే, చౌహాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదు: కేంద్ర మంత్రి తోమర్
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేసే ప్రసక్తి లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, విమర్శలు చేయడం మాని చర్చపై శ్రద్ధ పెట్టాలని ప్రతిపక్షాలకు సూచించారు. సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా లేవని ఆయన విమర్శించారు. బీజేపీ పాలిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకున్నారని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కాదని ఆయన ఎద్దేవా చేశారు. కాగా, మోదీ గేట్, వ్యాపం కుంభకోణంపై స్పందించాలని, బాధ్యులను పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఉభయ సభలను కాంగ్రెస్ అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.