: మొదటిసారి తండ్రి అవుతున్న పురుషులు బరువు పెరుగుతున్నారట!


మొదటిసారి తండ్రి అయిన పురుషులు బరువు పెరుగుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. పది వేల మంది పురుషులపై సర్వే చేసిన అమెరికా సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. వివాహం తరువాత సాధారణంగా బరువు పెరిగే పురుషులు, తొలిసారి తండ్రి అయ్యాక మరికాస్త బరువు పెరుగుతారట. తండ్రి అవ్వడం పురుషుల బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) పై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై చేసిన సర్వేలో తొలిసారి తండ్రి అయ్యేటప్పుడు బరువు పెరుగుతున్నట్టు తేలింది. ఇంటి వద్ద ఉండే తండ్రులకు సుమారుగా బీఎంఐ 2.6 శాతం పెరుగుతోందని, ఇంటిదగ్గర ఉండని తండ్రులకు బీఎంఐ 2 శాతం పెరుగుతుందని ఈ సర్వే తెలిపింది.

  • Loading...

More Telugu News