: తాగుబోతు ప్రేక్షకులకు లంక బోర్డు ఝలక్


శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మూడో వన్డే మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకులు కొలంబో ప్రేమదాస స్టేడియంలో రసాభాస సృష్టించారు. రాళ్లు, ఇతర వస్తువులతో వీరంగం వేశారు. శ్రీలంక ఓటమి బాటలో పయనిస్తుండడంతో తట్టుకోలేని వీరాభిమానులు మద్యం మత్తులోనే ఇలా ప్రవర్తించారని భావించిన లంక క్రికెట్ బోర్డు... నాలుగో వన్డే (బుధవారం) సందర్భంగా తాగుబోతు ప్రేక్షకులకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. మ్యాచ్ కు వేదికైన కొలంబో స్టేడియంలో మద్య నిషేధం విధించింది. గాజు గ్లాసులు, బాటిళ్లు, అగ్గిపెట్టెలు, లైటర్లను కూడా నిషేధించారు. ప్రస్తుతం కొలంబో ప్రేమదాస స్టేడియంలో ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 256 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో పాకిస్థాన్ నిలకడగా ఆడుతోంది. 29 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్ అహ్మద్ షేజాద్ 94, మహ్మద్ హఫీజ్ 49 పరుగులతో ఆడుతున్నారు. ఆ జట్టు విజయం సాధించాలంటే ఇంకా 74 పరుగులు చేయాలి. చేతిలో 9 వికెట్లుండగా, మరో 21 ఓవర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప శ్రీలంక ఓటమి ఖాయంగానే కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News