: రాజమండ్రిలో భారీ అగ్నిప్రమాదం... ఘటనస్థలానికి చేరుకున్న చంద్రబాబు
రాజమండ్రిలో గోకవరం బస్టాండ్ వద్ద ఓ హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసు వాహనాలు, ఇతరులకు చెందిన కార్లు దగ్ధమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఆ ప్రమాదంతో, పుష్కరాలకు వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. కాగా, అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే సీఎం చంద్రబాబునాయుడు డీజీపీ జేవీ రాముడుతో కలిసి గోకవరం బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. సంఘటన స్థలిని పరిశీలించారు. సీఎం ప్రత్యక్ష సాక్షులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే మంటలు చెలరేగినట్టు తెలిసిందని చంద్రబాబు అన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, సంయమనం పాటించాలని సూచించారు.