: యాకూబ్ ను ఉరితీస్తే ఎవరికి న్యాయం జరుగుతుంది?: సీపీఐ(ఎం)


ముంబయి పేలుళ్ల కీలక నిందితుడు యాకూబ్ మెమన్ కు ఈ నెల 30న ఉరిశిక్ష అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, అతడిని ఉరితీస్తే ఎవరికి న్యాయం జరుగుతుందని సీపీఐ(ఎం) ప్రశ్నిస్తోంది. యాకూబ్ మెమన్ దాఖలు చేసిన ఉరిశిక్ష మినహాయింపు పిటిషన్ ను ఆమోదించి ఉంటే బాగుండేదని సీపీఐ(ఎం) అభిప్రాయపడింది. మెమన్ లొంగిపోయి విచారణకు సహకరించడం వల్ల కేసుకు సంబంధించి ఎన్నో వివరాలు వెల్లడయ్యాయని ఓ ప్రకటనలో పేర్కొంది. రాజీవ్ గాంధీ హంతకులకు విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చిన ఉదంతాన్ని ఈ సందర్భంగా సీపీఐ(ఎం) ఉదహరించింది. యాకూబ్ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు మంగళవారం నాడు తిరస్కరించింది. దీంతో, అతడు చివరి అవకాశంగా మహారాష్ట్ర గవర్నర్ కు క్షమాభిక్ష పిటిషన్ సమర్పించాడు. కాగా, దేశంలో మరణశిక్షను రద్దు చేయాలన్న డిమాండ్ కు తాము కట్టుబడి ఉన్నట్టు సీపీఐ(ఎం) తన ప్రకటనలో పేర్కొంది.

  • Loading...

More Telugu News