: 'నెయిల్ హౌస్' పేరు విన్నారా?...అయితే ఇది చదవండి!
ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం భారత్ లో ప్రజలు సహకరిస్తే భూసమీకరణ జరుపుతారు. లేని పక్షంలో భూసేకరణ జరుపుతారు. అదే చైనాలో అయితే భూమి యజమాని అంగీకరించకపోతే ఆ భూమి అలా ఉంచేయాల్సిందే. దానిని ప్రభుత్వం కానీ, అక్కడి అధికారులు కానీ ఎవరూ కదిలించరు. దీంతో అక్కడ అత్యంత అభివృద్ధి చెందిన షాపింగ్ మాల్స్ పక్కన, విస్తారమైన రోడ్ల మధ్యలో కొన్ని పాత ఇళ్లు కనిపిస్తాయి. అలా మిగిలిపోయిన ఏకాకి ఇళ్లను 'నెయిల్ హౌస్' అంటారు. చిత్రమేంటంటే బాగా అభివృద్ధి చేసిన రోడ్ల మధ్యలో కూడా ఈ 'నెయిల్ హౌస్' లు కనిపించడం విశేషం. ఇలా ఒక్క ఇల్లే ఎందుకు ఉండిపోతుందని స్థానికులను అడిగితే, ప్రభుత్వ, ఇతర సంస్థలు ఇచ్చే పరిహారం నచ్చని యజమానులు ఇంటి స్థలం వదులుకునేందుకు ఇష్టపడరని, అలాంటి సందర్భాల్లో వాటిని మినహాయించి నిర్మాణాలు చేపడతారని చెబుతారు.