: వ్యక్తిగత కార్యదర్శిని సస్పెండ్ చేసిన ఉత్తరాఖండ్ సీఎం


ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తన వ్యక్తిగత కార్యదర్శి మహ్మద్ షాహిద్ ను సస్పెండ్ చేశారు. ఓ వార్తా పత్రిక చేసిన స్టింగ్ ఆపరేషన్ లో మద్యం లైసెన్సుల కేటాయింపులో లంచాల వాటాల పంపకాలపై మాట్లాడుతూ, ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను విడుదల చేసిన బీజేపీ, కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కుపెట్టింది. సీఎం రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. దీనిపై స్పందించిన సీఎం హరీష్ రావత్ వ్యక్తిగత కార్యదర్శిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలను రావత్ ఖండించారు.

  • Loading...

More Telugu News