: మోదీకి పాక్ ప్రధాని తీపి కానుక!
ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ రంజాన్ కానుకగా మామిడిపళ్లను పంపించారు. గత ఏడాది రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీలకు రంజాన్ కానుకగా షరీఫ్ మామిడి పళ్లను పంపిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవలే రష్యాలో మోదీ, షరీఫ్ భేటీ అయిన సంగతి కూడా విదితమే. వీరి భేటీ అనంతరం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ సరిహద్దు గ్రామాలపై పాక్ కాల్పులకు దిగింది. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం పాక్ లో భారత్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, డ్రోన్ తో గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపించిన పాక్, రంజాన్ సందర్భంగా భారత్ సైనికులు ఇచ్చిన మిఠాయిలను తిరస్కరించిన సంగతి తెలిసిందే. సైన్యం సంగతెలా ఉన్నా ప్రధానుల మధ్య స్నేహసంబంధాలు కొనసాగడం విశేషం.