: అమరావతిలో మీ పాత్ర విలనా? వ్యాంపా?: ఎమ్మెల్యే రోజాను ప్రశ్నించిన టీడీపీ నేత రాజేంద్రప్రసాద్


ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఊహాచిత్రాలు, వీడియోలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఖండించారు. రాజధాని చిత్రాలు 'బాహుబలి', 'మగధీర' చిత్రాల ట్రైలర్స్ లా ఉన్నాయని అర్థం పర్ధం లేకుండా మాట్లాడుతున్నారని హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. ఆమెకు సహజంగా ఉన్న అహంభావంతోనే అలా మాట్లాడారన్నారు. అయితే తెలిసో, తెలియకో రోజా చెప్పినట్టు... 'బాహుబలి', 'మగధీర'లు అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేశారని; అలాగే సీఎం చంద్రబాబు కూడా ఓ అసాధ్యాన్ని చేసి చూపించబోతున్నారని పేర్కొన్నారు. పాపి చిరాయువు అన్నట్టుగా రోజా అమరావతి రాజధాని పూర్తయ్యేవరకూ జీవించి ఉండాలన్నారు. అయితే అమరావతిలో మీ పాత్ర విలనా? వ్యాంపా? అని ప్రశ్నించిన ఆయన, ఎటూ విలన్ పాత్రకు జగన్ ఉన్నారని, కాబట్టి మీది వ్యాంప్ పాత్రేనని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News