: 'అమితాబ్-డీడీ కిసాన్' వ్యవహారంపై కేంద్రం ఆరా


కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న దూరదర్శన్ కిసాన్ చానల్ కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసడార్ గా నియమితుడైన సంగతి తెలిసిందే. అందుకుగాను ఆయన రూ.6 కోట్లకు పైగా పారితోషికం అందుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయమై బిగ్ బి వెంటనే స్పందించారు. తానెలాంటి పారితోషికం స్వీకరించలేదని స్పష్టం చేశారు. సామాజిక బాధ్యతగా స్పందించి ఈ ప్రచార కార్యక్రమానికి సంసిద్ధత తెలిపానని చెప్పారు. ఈ విషయంపై ఇప్పుడు కేంద్రం దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ జేఎస్ మాధుర్ ప్రసారభారతి సీఈవో జవహర్ సర్కార్ ను ఆదేశించారు. కాగా, డీడీ కిసాన్ చానల్ ప్రచార కార్యక్రమాలను లింటాస్ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. తాము అమితాబ్ కు ఎలాంటి చెల్లింపులు చేయలేదని లింటాస్ వర్గాలంటున్నాయి.

  • Loading...

More Telugu News