: 'శాకాహారులుగా మారండి.. పర్యావరణాన్ని కాపాడండి'
ప్రపంచవ్యాప్తంగా జంతు హింసపై ఎలుగెత్తే పెటా (పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ యానిమల్స్) 'ఎర్త్ డే' సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రదర్శన నిర్వహించింది. హైదరాబాద్ లో నేడు పెటా ఉద్యమకారులు ఆకుపచ్చని దుస్తుల్లో ప్లకార్డులు ప్రదర్శించి అవని దినోత్సవం ఆవశ్యకతను చాటారు. మాంసపు పరిశ్రమల నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వల్ల వాతావరణం కలుషితమవుతుందని పెటా కార్యకర్తలు వివరించారు. పర్యావరణం పరిరక్షించుకోవాలంటే, జంతువధను నిలిపివేయాని వారు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడందరూ పర్యావరణాన్ని కాపాడుకునే లక్ష్యంతో శాకాహారులుగా మారుతున్నారని పేర్కొన్నారు.