: ఈస్ట్ కోస్ట్ 'గేట్ వే'గా ఏపీ తయారయ్యే అవకాశం: చంద్రబాబు


దేశంలో ఏ రాష్ట్రానికీ లేని వనరులు ఆంధ్రప్రదేశ్ కు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. వాటిని ఉపయోగించుకొని ప్రగతి పథంలో ముందుకెళతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఏపీ ఈస్ట్ కోస్ట్ గేట్ వే (తూర్పు తీరానికి ముఖద్వారం)గా తయారయ్యే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంతీయ విద్యా సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో సవాలక్ష సమస్యలున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే సవాళ్లను ఎదుర్కొంటూ రాష్ట్రాభివృద్ధికై ముందుకెళుతున్నామని తెలిపారు. నదుల అనుసంధానంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని, దీని ద్వారా నీటి వృథాను అరికడదామని సీఎం పిలుపునిచ్చారు. ఏడాదిలో 3వేల టీఎంసీల నీరు గోదావరి నుంచి సముద్రంలో కలుస్తుందని వివరించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని సంపూర్ణంగా వినియోగించుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News