: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పిటిషన్ పై విచారణ వాయిదా
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదాపడింది. ఈ రోజు జరిగిన విచారణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అనర్హతకు సంబంధించి హైకోర్టు స్పీకర్ కు ఆదేశాలిచ్చే విషయం రాజ్యాంగ పరిధిలో ఎక్కడైనా ఉందా? అని పిటిషనర్ ను కోర్టు ప్రశ్నించింది. ఇక సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని, మళ్లీ ఆయన 6 నెలల్లోపు ఎమ్మెల్యేగా గెలవాలన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు ఏడుగురు ఎమ్మెల్సీల అనర్హతపై దాఖలైన పిటిషన్ ను పిటిషనర్ ఉపసంహరించుకున్నారు. ఈ నెల 31న కొంతమంది ఎమ్మెల్సీల గడువు ముగియనుంది.