: బీజేపీ సీనియర్ నేత లేఖపై ఘాటుగా స్పందించిన శివరాజ్ సింగ్ చౌహాన్


వ్యాపం కుంభకోణంతో పార్టీ పరువు పోయిందని బీజేపీ సీనియర్ నేత శాంతకుమార్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాసి, ఆ ప్రతిని ఫేస్ బుక్ లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఘాటుగా స్పందించారు. శాంతకుమార్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. నిజానిజాలు తెలియకుండా ప్రతిపక్షాలకు వంత పాడొద్దని ఆయన సూచించారు. వ్యాపం కుంభకోణాన్ని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కు అప్పగించామని ఆయన తెలిపారు. టాస్క్ ఫోర్స్ నిష్పాక్షికంగా విచారణ చేసిందని ఆయన పేర్కొన్నారు. నిజాయతీగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ ను సుప్రీంకోర్టు అభినందించిందని ఆయన గుర్తుచేశారు.

  • Loading...

More Telugu News