: 1956లోనే రాజమండ్రిలో 20 లక్షల మంది పుష్కర స్నానం ఆచరించారు
గోదావరి పుష్కరాల నేపథ్యంలో, ఇరు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది జనం పుణ్య స్నానాలను ఆచరిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాజమండ్రి అయితే జన గోదావరిని తలపిస్తోంది. కానీ, ఒక విషయం మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 1956లోనే అంటే 59 ఏళ్ల క్రితమే గోదావరి పుష్కరాల సందర్భంగా దాదాపు 20 లక్షల మంది రాజమండ్రికి తరలి వచ్చి పుష్కర స్నానం ఆచరించారట. అప్పట్లో రాష్ట్ర జనాభా 3 కోట్లుగా ఉండేది.