: ఏపీ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలివే
నేడు రాజమండ్రిలో సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశం తరువాత చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటి వివరాలు * కర్నూలులో డీఆర్ డీవోకు 2 వేల ఎకరాల భూమి ఇచ్చేందుకు అంగీకారం * విశాఖపట్నం ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో ఈ-సెంట్రిక్ సొల్యూషన్స్ కు 300 ఎకరాల కేటాయింపు * పుష్కరాల ముగింపు రోజున 'పుష్కర జ్యోతి' * విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయ భూసేకరణపై మరింత చర్చ * పుష్కరాల్లో బాగా పనిచేసిన వారికి ప్రశంసా పత్రాలు * వీలైనంత త్వరగా ప్రభుత్వ శాఖలన్నీ విజయవాడకు తరలింపు * రెవెన్యూ విధానాన్ని మార్చేందుకు కేబినెట్ సబ్ కమిటీ * ప్రధాని మోదీ సూచించిన విధంగా కజకిస్థాన్, తుర్కమెనిస్థాన్, ఆస్కాన్, అస్నాబాధ్ రాజధానులను పరిశీలించాలని నిర్ణయం * రాజధాని నిర్మాణ కాంట్రాక్టుల కోసం 'స్విస్ చాలెంజ్'లో పాల్గొనాలని చైనా, జపాన్, సింగపూర్, మలేషియా దేశాలకు లేఖలు