: రాజమండ్రిలో నకిలీ బుగ్గ కార్ల హల్ చల్
పవిత్ర గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రికి ఎంతో మంది రాజకీయ ప్రముఖులు విచ్చేస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో బుగ్గకార్ల సందడి ఎక్కువైంది. దీంతో, కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా కార్లకు బుగ్గలు తగిలించి, అద్దెకు ఇస్తున్నారు. కారుకు ఒక అద్దె, బుగ్గకు మరో అద్దె వసూలు చేస్తున్నారు. మరోవైపు, బుగ్గ కార్లను చూసి, ఎవరో వీఐపీ వస్తున్నారనుకుని పోలీసులు కూడా ట్రాఫిక్ లైన్ క్లియర్ చేస్తున్నారు. దీంతో, ఈ నకిలీ బుగ్గ కార్లు రాజమండ్రి రోడ్లపై చట్ట విరుద్ధంగా హల్ చల్ చేస్తున్నాయి. సాధారణంగా గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రమే ఈ బుగ్గ కార్లను వినియోగిస్తారు.