: రాజమండ్రిలో చిరంజీవి, అల్లు అరవింద్ పుష్కరస్నానం
కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వీఐపీ ఘాట్ లో పుష్కరస్నానం చేశారు. ఆయనతో పాటు నిర్మాత అల్లు అరవింద్, అల్లు శిరీష్, ఇతర కుటుంబ సభ్యులు కూడా పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం ఘాట్ ఒడ్డున చిరంజీవి, అరవింద్ లు పిండ ప్రదానం నిర్వహించారు. చిరు మీడియాతో మాట్లాడుతూ, పుష్కరాల తొలిరోజు తొక్కిసలాటలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నానని తెలిపారు. ఈ సమయంలో చిరంజీవిని చూసేందుకు పుష్కర యాత్రికులు పోటీ పడ్డారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించారు.