: కేసీఆర్ తో భేటీకి ఎలాంటి ప్రాధాన్యం లేదు: డీఎస్
ఇటీవల పార్టీలో చేరిన డి.శ్రీనివాస్ తో ఆయన నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. అనంతరం డీఎస్ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ తో భేటీకి ఎలాంటి ప్రాధాన్యం లేదని చెప్పారు. కేసీఆర్ తో కేవలం లంచ్ మీటింగ్ మాత్రమే జరిగిందన్నారు. అయితే, వీరిద్దరూ పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.