: మోదీ పాలనపై బాలీవుడ్ భామ విమర్శల ట్వీట్... ఊహించని రీతిలో నెటిజన్ల స్పందన


ముంబయిలో కురిసిన కుండపోత వర్షం అక్కడి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోగా, పలు కార్యాలయాలు, స్కూళ్లు మూతపడ్డాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాను కూడా వర్షం కారణంగా అసౌకర్యానికి గురయ్యానంటోంది బాలీవుడ్ భామ నేహా ధుపియా. అంతటితో ఆగకుండా, ఏకంగా ప్రధాని మోదీ పాలనపై ఓ ట్వీట్ సంధించింది. "ఏకధాటిగా కురిసిన వర్షంతో ముంబయి తడిసిముద్దయింది. గుడ్ గవర్నెన్స్ అంటే సెల్ఫీలు, యోగా చేయించడం కాదు... భద్రతపై ప్రజలకు భరోసా ఇవ్వాలి" అని ట్విట్టర్లో పేర్కొంది. ఈ ట్వీట్ కు విశేష స్పందన లభించింది. ఊహించని విధంగా ఆమెకు వ్యతిరేకంగా అత్యధికులు స్పందించారు. పబ్లిసిటీ కోసమే అమ్మడు ఇలా ట్వీట్ చేసిందని, కెరీర్ ను మళ్లీ ట్రాక్ లో పెట్టుకునేందుకే ఈ పాట్లు అని కొందరు పేర్కొన్నారు. చేయడానికి పనేమీ లేక సోషల్ మీడియాలో విహరిస్తోందని కొందరు విమర్శించారు. ఇంకొందరైతే నేహా ఛాయాచిత్రాలు పోస్టు చేసి వాటిపై జోకులు పేల్చారు.

  • Loading...

More Telugu News