: ఏ మొహం పెట్టుకుని వైయస్ విగ్రహానికి రాహుల్ గాంధీ పూలమాలలు వేస్తారు?: వైకాపా


కాంగ్రెస్ పార్టీపై వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విరుచుకుపడ్డారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. తమ ఓట్లను కాంగ్రెస్ పార్టీ టీడీపీకి మళ్లించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పిల్ల టీడీపీలా తయారైందని చెప్పారు. అనంతపురం పర్యటనలో ఏ మొహం పెట్టుకుని వైయస్ విగ్రహానికి రాహుల్ గాంధీ పూలమాలలు వేస్తారని ప్రశ్నించారు. వైయస్ కుటుంబంపై కేసులు పెట్టడం, ఛార్జ్ షీట్ లో ఏకంగా వైయస్ పేరునే పెట్టడం లాంటివన్నీ కాంగ్రెస్ పార్టీనే చేసిందని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించింది కాంగ్రెస్ పార్టీనే అని ఆమె దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News