: ఆంధ్రా మేధావులూ ఆలోచించుకోండి... హైదరాబాద్ ముందు అమరావతి ఎంత?: కేసీఆర్
400 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం ముందు ఇప్పటికీ కాగితాలపైనే ఉన్న అమరావతి నగరం ఎంత గొప్పదన్న విషయాన్ని ఆంధ్రా మేధావులే ఆలోచించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తనను విమర్శిస్తే సహిస్తానని, తెలంగాణనుగానీ, హైదరాబాదును గానీ కించపరిచినట్టు మాట్లాడితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. తెలంగాణకు సంస్కృతి, సంస్కారం ఉన్నాయని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాదును చూసి అసూయ పడుతున్నారని, భ్రమలకు పోతున్నారని, వాటిని వదిలి ప్రజలకు సేవ చేయడంపై దృష్టిని పెట్టాలని హితవు పలికారు.