: 'ఆండ్రాయిడ్ వద్దు, ఐఫోన్ ముద్దు' అంటున్నారు: యాపిల్ చీఫ్
ఇటీవలి కాలంలో ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లను వాడుతూ, ఐఫోన్ లకు మారుతున్న వారి సంఖ్య పెరుగుతోందట. ఈ విషయాన్ని ఐఫోన్లను మార్కెటింగ్ చేస్తున్న యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ వివరించారు. గడచిన త్రైమాసికంలో ఐఫోన్ల అమ్మకాలు అంతగా సంతృప్తిని కలిగించనప్పటికీ, ఆండ్రాయిడ్ ను వద్దనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడం భవిష్యత్తుపై అంచనాలను పెంచుతోందని ఆయన అన్నారు. గతంలో తాము విడుదల చేసిన ఫోన్లతో పోలిస్తే మెరుగైన పనితీరు, పెద్ద స్క్రీన్ కలిగిన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ లు ఆండ్రాయిడ్ కు అలవాటుపడ్డ వారికి మరింతగా నచ్చుతాయని అభిప్రాయపడ్డారు.