: పునర్విభజన చట్టం ఉల్లంఘనలపై ఆంధ్రప్రదేశ్ పై సుప్రీంలో తెలంగాణ పిటిషన్
పునర్విభజన చట్టంలోని పలు అంశాలలో ఏపీ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడిందంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విభజన హామీలను అమలు చేయడం లేదంటూ ఢిల్లీలోని టీ.ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఏర్పాటు, విభజన చట్టంలోని హామీలు, ఏపీ విద్యుత్ ఒప్పందాలపై విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ వ్యవహరిస్తోందని, విభజన హామీలన్నీ అమలయ్యేలా ఆదేశించాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.