: ఆ డ్రోన్ ను మేం ఏ ప్రభుత్వానికీ విక్రయించలేదు: డీజేఐ
పాకిస్థాన్ ఇటీవలే నియంత్రణ రేఖ సమీపంలో ఓ డ్రోన్ ను కూల్చివేయడం తెలిసిందే. అది భారత్ కు చెందిన డ్రోన్ అని పాక్ వర్గాలు ఆరోపించాయి. అయితే, ఆ డ్రోన్ తయారీదారు చైనాకు చెందిన డీజేఐ సంస్థ అని ఆ తర్వాత తెలిసింది. ఇప్పుడు ఆ సంస్థ డ్రోన్ కూల్చివేత వ్యవహారంపై స్పందించింది. ఆ డ్రోన్ ను తాము ఏ ప్రభుత్వానికీ విక్రయించలేదని డీజేఐ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వాలు తమకు డైరక్టు కస్టమర్లు కావని పేర్కొన్నాయి. కాగా, డ్రోన్ ను పాక్ దళాలు కూల్చివేసిన తదనంతరం ఇస్లామాబాద్ లోని భారత హై కమిషనర్ కు పాకిస్థాన్ సమన్లు జారీచేసింది. డ్రోన్ ప్రయోగం భారత సైన్యం పనే అని, దానిపై వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పుడు డీజేఐ సంస్థ ప్రకటనతో పాక్ వాదన తేలిపోయింది.