: 'స్విస్ చాలెంజ్' అంటున్న చంద్రబాబు సర్కారు... అంటే ఏంటంటే!


అమరావతి నిర్మాణానికి 'స్విస్ చాలెంజ్' పద్ధతిలో కాంట్రాక్టర్లను ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ పద్ధతిలో బిడ్లను దాఖలు చేసిన తరువాత, తక్కువ బిడ్ వేసిన వారికి కాంట్రాక్టును అప్పగించరు. తిరిగి పోటీలో ఉన్న కంపెనీ, అంతకన్నా తక్కువ ధరకు మెరుగైన డిజైన్ లో మరో ప్రణాళికను సమర్పించి కాంట్రాక్టును సొంతం చేసుకోవచ్చు. ఆపై కూడా మరో సంస్థ ఇంకో డిజైన్ ఇచ్చి, అది అధికారులకు నచ్చితే కాంట్రాక్టు ఆ సంస్థకు లభించే అవకాశాలను దగ్గర చేసే పద్ధతే 'స్విస్ చాలెంజ్'. నియమిత సమయంలో ఓ కంపెనీ ఇలా ఎన్నిసార్లయినా కాంట్రాక్టును సవరించుకోవచ్చు. కాగా, మాస్టర్ ప్లాన్ పూర్తి కావడంతో మిగిలిన పనులను శరవేగంగా పూర్తి చేయాలని సర్కారు భావిస్తోందని, ఇందులో భాగంగా పలు నిర్మాణ ప్రాజెక్టుల కోసం టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ సాధ్యమైనంత త్వరలో మొదలవుతుందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News