: గవర్నర్ తెలుగు ప్రజలకు గుదిబండలా మారారు... సీపీఐ నేత నారాయణ కామెంట్


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ విషయంపైనా సరైన సమయంలో నిర్ణయం తీసుకోని గవర్నర్ నరసింహన్... తెలుగు ప్రజల పాలిట గుదిబండగా మారారని ఆరోపించారు. నేటి ఉదయం తిరుపతి వచ్చిన ఆయన కొద్దిసేపటి క్రితం అక్కడి మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజలకు ఈ గుదిబండ బరువు నుంచి విముక్తి కల్పించేందుకు గవర్నర్ ను మారిస్తేనే సరిపోదని, ఏకంగా వ్యవస్థనే మార్చాలని కూడా నారాయణ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News