: బ్రెస్ట్ కేన్సర్ పరీక్షల విషయంలో మహిళలకు ఏంజెలినానే స్పూర్తి!


మహిళలు బ్రెస్ట్ కేన్సర్ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకురావడంలో హాలీవుడ్ నటి ఏంజెలినా జోలియే స్పూర్తి అని ఓ పరిశోధన తెలిపింది. తనలో కేన్సర్ కారక లక్షణాలున్నాయని, దాని కారణంగా తన రొమ్ములకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందని, ఒవేరియన్ కేన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందన్న కారణాలతో రెండేళ్ల కిందట ఏంజెలినా సర్జరీ ద్వారా తన రొమ్ములను తొలగించుకుంది. ఇందుకు ముందుగా ఆమె జన్యువు బీఆర్ఎస్ఏ2 పరీక్ష చేయించుకుని, ఆ విషయాన్ని అప్పట్లోనే ఆమె బహిరంగంగా ప్రకటించింది. ఈ క్రమంలో గతంలో కేన్సర్ ఉన్నవారి కుటుంబాల్లోని చాలామంది మహిళలు జోలీ ప్రభావంతో జన్యు సంబంధ పరీక్షలు చేయించుకుంటున్నారని అమెరికాలోని నార్త్ కరోలియా స్టేట్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, పరిశోధన రచయిత కామి కొస్నెకో తెలిపారు. జోలీ తన విషయాన్ని వెల్లడించడం వల్లే వారిపై ఆ ప్రభావం పడిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో జెనెటిక్ టెస్టింగ్ ఎవరినైనా ప్రభావితం చేసిందా? అన్న విషయాన్ని తెలుసుకోవాలని జోలీ ప్రకటించిన మూడు రోజుల్లో ఆన్ లైన్ లో తామొక ప్రశ్నాపత్రాన్ని ఉంచామన్నారు. పరిశోధనలో భాగంగా జరిపిన సర్వేలో యూఎస్ నుంచి మొత్తం 356 మంది ఆ ప్రశ్నాపత్రాన్ని పూర్తి చేశారని చెప్పారు. అందులోనే 295 మంది జోలీ ప్రకటనపై చైతన్యులయ్యారని వివరించారు. వీరిలో 30 శాతం మహిళలు జన్యు సంబంధ పరీక్ష చేయించుకోవాలనుకుంటున్నట్టు చెప్పినట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News