: వరుస కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాక్
ఇరాక్ మరోసారి రక్తమోడింది. దక్షిణ బాగ్దాద్ ప్రాంతంలో వరుస కారు బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. తొలి పేలుడు ఘటనలో 18 మంది అక్కడికక్కడే చనిపోయారు. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్ల ధాటికి భవనాలు, షాప్ లు దగ్ధమయ్యాయి. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉండడం కలచి వేస్తోంది. రెండో పేలుడు జాఫరానియా ప్రాంతలో జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.