: హైకోర్టు విభజనను కేంద్ర మంత్రులే అడ్డుకుంటున్నారు: టీఆర్ఎస్ ఎంపీ కవిత
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనను కేంద్ర కేబినెట్ లోని సీనియర్ మంత్రులే అడ్డుకుంటున్నారని నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైకోర్టు విభజనను త్వరితగతిన పూర్తి చేయాలన్న డిమాండ్ తో కవిత నేతృత్వంలో టీఆర్ఎస్ ఎంపీలు కొద్దిసేపటి క్రితం పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు విభజనను కేంద్ర కేబినెట్ లోని సీనియర్ మంత్రులే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కల్పించుకుని హైకోర్టు విభజనను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.