: హైకోర్టు విభజన కోసం పార్లమెంటు ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన


తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎంపీలు పార్లమెంటు ఆవరణలో కొద్దిసేపటి క్రితం ఆందోళనకు దిగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టు విభజనను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేడు రెండో రోజు సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలోనే ఈ అంశాన్ని ప్రస్తావించేందుకు సన్నద్ధమయ్యారు. అయితే వ్యాపం, లలిత్ మోదీ వ్యవహారాలపై విపక్షాల ఆందోళనలతో ప్రారంభమైన వెంటనే లోక్ సభ వాయిదా పడింది. దీంతో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News