: మోతెలో కాంగ్రెస్ నేతల పుష్కర స్నానాలు
ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మోతెలో పలువురు కాంగ్రెస్ నేతలు ఈరోజు పుష్కర స్నానాలు చేశారు. తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకటరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు కుటుంబ సమేతంగా గోదావరి పుష్కరస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురిసి అన్నదాతకు పంట దిగుబడి బాగా రావాలని దేవుడిని ప్రార్థించానని తెలిపారు.