: రాజమండ్రిలో జరుగుతున్న ఏపీ కేబినెట్ భేటీ


ఏపీ మంత్రివర్గ సమావేశం రాజమండ్రిలోని ఆర్ అండ్ బి అతిథిగృహంలో జరుగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అనారోగ్యం కారణంగా హాజరుకాలేదు. మిగతా మంత్రులందరూ భేటీలో పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలు, గృహ నిర్మాణ రంగం, మున్సిపల్ కార్మికుల వేతనాలు సహా పలు భూకేటాయింపులపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. సింగపూర్ బృందం సమర్పించిన రాజధాని నగర నిర్మాణ ప్రణాళికపై కూడా సమావేశంలో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News