: తొమ్మిదో రోజుకు చేరిన పుష్కరాలు... రాజమండ్రి, కొవ్వూరులో వర్షంలోనే పుష్కర స్నానాలు
గోదావరి మహా పుష్కరాలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పుష్కరఘాట్లు భక్తులతో నిండిపోయాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. అయినప్పటికీ రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురం, తదితర ప్రాంతాల్లోని పుష్కరఘాట్లలో భక్తులు వర్షంలోనే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వర్షం కారణంగా విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరిగింది. దాంతో స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటి వెళ్లవద్దని పోలీసులు సూచిస్తున్నారు.